మంచి నిద్ర కావాలంటే…ఈ టిప్స్ పాటించండి..!

నిద్ర మ‌నిషి ఆరోగ్యంగా ఉండ‌టానికి ఎంతో అవ‌స‌రం. స‌రిప‌డినంత స‌రైన నిద్ర లేక‌పోతే అనారోగ్య స‌మస్య‌లు త‌ప్ప‌వు. అయితే హ్యాపీగా నిద్రపోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.

మంచి నిద్ర కావాలంటే...ఈ టిప్స్ పాటించండి..!

Updated on: Jul 10, 2020 | 11:49 PM

నిద్ర మ‌నిషి ఆరోగ్యంగా ఉండ‌టానికి ఎంతో అవ‌స‌రం. స‌రిప‌డినంత స‌రైన నిద్ర లేక‌పోతే అనారోగ్య స‌మస్య‌లు త‌ప్ప‌వు. అయితే హ్యాపీగా నిద్రపోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.

  • సెల్ ఫోన్ మీద ఉండే బ్లూ లైట్ అనేది కళ్లకు చాలా హాని చేస్తోంది. ముఖ్యంగా చీకట్లో దీన్ని వినియోగించ‌డం వ‌ల్ల క‌ళ్ల‌పై ఎఫెక్ట్ చూపించి..నిద్ర‌ను దూరం చేస్తోంది.
  • కెఫెన్ ఉండే ప‌దార్థాల‌కు రాత్రిపూట‌ సాధ్య‌మైనంత దూరంగా ఉండండి. చాలా మంది కాఫీల‌కు చాలా అల‌వాటు ప‌డి ఉంటారు. అది మోతాదుకు మించితే నిద్ర‌కు ప్ర‌మాద‌మే.
  • అతిగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌ను మాగ్జిమ‌మ్ త‌ప్పించండి. అవి సరిగ్గా జీర్ణం అవ్వ‌క మీ నిద్ర‌కు భంగం క‌లిగిస్తాయి.
  • చాలామంది రాత్రి పూట‌ వ్యాయామం చేస్తే అలసిపోయి బాగా నిద్రపడుతుందని అనుకుంటారు. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శ‌రీరంలోని నరాల‌న్నీ ఉత్తేజం అవుతాయి. అప్పుడు నిద్ర కోసం చాలా స‌మ‌యం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది.
  • మద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానికరం. అలాగే మీ ప్ర‌శాంతమైన నిద్ర‌కు కూడా ప్ర‌మాద‌క‌రం. రాత్రి భోజ‌నానికి ముందు మద్యం సేవించడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే, స్వ‌చ్చ‌మైన నిద్ర‌ కావాలంటే రాత్రి పూట మద్యానికి దూరంగా ఉండాల్సిందే.