మున్నాభాయ్‌కి లంగ్ క్యాన్స‌ర్‌.. నిర్మాత‌ల గుండెల్లో హ‌డ‌ల్‌

| Edited By:

Aug 21, 2020 | 12:34 PM

ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన షూటింగ్స్ అన్నీ ఆగిపోగా, మ‌రోవైపు దిగ్గ‌జ న‌టులు అనారోగ్యంతో క‌న్ను మూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌లే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది అవుతుంద‌ని, ఆస్ప‌త్రికి వెళ్లిన సంజ‌య్ ద‌త్‌కి లంగ్ క్యాన్స‌ర్..

మున్నాభాయ్‌కి లంగ్ క్యాన్స‌ర్‌.. నిర్మాత‌ల గుండెల్లో హ‌డ‌ల్‌
Follow us on

ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన షూటింగ్స్ అన్నీ ఆగిపోగా, మ‌రోవైపు దిగ్గ‌జ న‌టులు అనారోగ్యంతో క‌న్ను మూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌లే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది అవుతుంద‌ని, ఆస్ప‌త్రికి వెళ్లిన సంజ‌య్ ద‌త్‌కి లంగ్ క్యాన్స‌ర్ అని తెలియ‌గానే అభిమానులు, ఇండ‌స్ట్రీ మొత్తం షాక్‌కి గురైతంది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజుల ముందే జైలు నుంచి తిరిగొచ్చాక వ‌రుస సినిమా ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పారు. అయితే ఈ లోపే ఆయ‌న‌కి లంగ్ క్యాన్స‌ర్ అని తెలియ‌డంతో నిర్మాత గుండెల్లో హ‌డ‌ల్ మొద‌లైంది. ప్ర‌స్తుతం సంజ‌య్ న‌టిస్తున్న అన్ని ప్రాజెక్టులన్నీ భారీవే కావ‌డంతో.. అవ‌న్నీ ఇప్పుడు ఆగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ర‌ణ్‌భీర్ క‌పూర్ హీరోగా ‘షంషేర్’ అనే చిత్రంలో సంజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఇంకా 50 శాతం మాత్ర‌మే షూటింగ్ మిగిలి ఉంది. అలాగే అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా ‘భుజ్’ సినిమా, కేజీఎఫ్ క‌న్న‌డ‌ హిట్ సినిమా సీక్వెల్‌ ‘కేజీఎఫ్‌-2’లోనూ సంజ‌య్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కొన్ని స‌న్నివేశాల్లో న‌టించ‌గా, ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా అక్ష‌య్ కుమార్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పృథ్వీరాజ్’‌లోనూ ఆయ‌న న‌టిస్తున్నారు.

ఇక సంజ‌య్ ముఖ్య పాత్ర‌లో ‘తోర్భాజ్’ చిత్రీక‌ర‌ణ చిత్రం కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. ఇలా ఆరు ప్రాజెక్టుల్లో ఆయ‌న చేస్తున్న చిత్రాల బిజినెస్ 750 కోట్ల‌కి పైగానే ఉంటుంద‌ని అంటున్నారు. ఇక సంజ‌య్ త్వ‌ర‌గా కోలుకుని, సినిమా షూటింగ్స్‌లో పాల్గొనాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

Read More:

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?

ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. వైసీపీ ఎమ్మెల్యే పూజ‌లు