కరోనా యోధులకు రుణపడి ఉంటాం: రాష్ట్రపతి

|

Aug 14, 2020 | 8:16 PM

74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగంలో దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. కరోనా యోధులకు యావత్ దేశం రుణపడి ఉందన్నారు. కరోనా ప్రభావంతో దేశం అప్పుల్లో కూరుకుపోయిందని, ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టారని అన్నారు.

కరోనా యోధులకు రుణపడి ఉంటాం: రాష్ట్రపతి
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో ప్రతి ఒక్కరు యుద్ధం చేస్తున్నారని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగంలో దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. కరోనా యోధులకు యావత్ దేశం రుణపడి ఉందన్నారు. కరోనా ప్రభావంతో దేశం అప్పుల్లో కూరుకుపోయిందని, ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టారని అన్నారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో జనాన్ని కాపాడేందుకు కేంద్రం అనేక ఉద్దీపాన పథకాలను ప్రకటించిందని రాష్ట్రపతి గుర్తు చేశారు.

2020లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఈ-లెర్నింగ్ బాగా పెరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ఆయోధ్యపై సుప్రీం తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారన్న రాష్ట్రపతి రామ మందిర నిర్మాణం ఇప్పటికే మొదలైందన్నారు.

భారత్-చైనా సరిహద్దులో వీర సైనికులు పోరాటాన్ని మర్చిపోలేమన్న ప్రెసిడెంట్.. గల్వాన్ ఘటనలో అమరులైన భారత సైనికులకు వందనం చేస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. అధ్యక్షుడు కోవింద్ 2017 సంవత్సరంలో ఎన్నికైయ్యాక , స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశానికి ఆయన చేసిన నాల్గవ ప్రసంగం ఇది.