గాయని లతా మంగేష్కర్‌కు రాష్ట్రపతి కోవింద్ ఆత్మీయ పరామర్శ

ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబయిలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేసింది. అంతేకాదు రాష్ట్రపతితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ఇంటికి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానట్టు ఆమె తెలిపారు.  ఈ పర్యటనలో […]

గాయని లతా మంగేష్కర్‌కు రాష్ట్రపతి కోవింద్ ఆత్మీయ పరామర్శ

Edited By:

Updated on: Aug 19, 2019 | 7:08 AM

ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబయిలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేసింది. అంతేకాదు రాష్ట్రపతితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ఇంటికి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానట్టు ఆమె తెలిపారు.  ఈ పర్యటనలో రాష్ట్రపతి దంపతులతో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపుతులు కూడా లతా మంగేష్కర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.