ఆయన ఓ పల్లెటూరి వ్యక్తి. ఉండేది పూరింట్లో. ఆయన వాహనం ఏంటో తెలుసా?..సైకిల్. ఆ వ్యక్తే ఇప్పుడు కేంద్ర మంత్రి. నమ్మలేకపోతున్నారా..అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే.
ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన ప్రతాప్ చంద్ర సారంగిని అందరూ ఒడిశా మోదీ అని పిలుస్తుంటారు. స్వతహాగా సామాజిక కార్యకర్త అయిన సారంగి బీజేపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో బాలాసోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి బిజు జనతా దళ్ అభ్యర్థి రబీంద్ర కుమార్ జేనపై 12,956 ఓట్ల తేడాతో గెలుపొందారు. నిరాడంబరత, అత్యంత సాధారణ జీవన శైలితో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించిన సారంగి..సూక్ష్మ, మధ్య పరిశ్రమల శాఖతో పాటు పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.