Salaar Prabhas : వరుస సినిమాలతో దూకుడుమీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. మరో సినిమా రాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరించిన ‘బాహుబలి’ తర్వాత భారీ చిత్రాలపైనే ప్రభాస్ ఫోకస్ పెట్టారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’ వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. ‘సలార్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించింది నిర్మాణ సంస్థ. యూనిట్ విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ కోర మీసంతో ఎంతో వైలెంట్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఓ పెద్ద గన్ను కూడా పట్టుకుని రాయల్ లుక్‌లో అదరగొట్టారు. దాంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను ఓ మాఫియా డాన్ కథతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ పోస్టర్లో ప్రభాస్ కనిపిస్తున్నారు.
మరోవైపు.. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే ‘ఆదిపురుష్’లో నటించనున్నారు. అనంతరం నాగ్ అశ్విన్ సినిమా గానీ, ప్రశాంత్ చిత్రం ‘సలార్’ గానీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్లో రూపొందనున్నాయి.
ఇప్పటికే వరుస చిత్రాలను ప్రకటించిన ప్రభాస్ ఆ చిత్రాలు షూటింగ్ ముగిసిన తర్వాత ఈ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా భారీ హిట్ కొట్టిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్‌గా కే జి ఎఫ్ చాప్టర్ టు రూపొందుతుంది. బహుశా ఆ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
#Prabhas in #SALAAR
THE MOST VIOLENT MEN.. CALLED ONE MAN.. THE MOST VIOLENT!!
Revealing our next Indian Film, an Action Saga.@VKiragandur @prashanth_neel pic.twitter.com/RqaIPwSUiB— Hombale Films (@hombalefilms) December 2, 2020