Hero Prabhas: ‘రాధేశ్యామ్‌’ టీమ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన డార్లింగ్‌ ప్రభాస్‌… ఖుషీ అవుతోన్న యూనిట్‌ సభ్యులు..

|

Jan 15, 2021 | 5:41 AM

Prabhas Gift To Movie Unit: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాహుబాలి సినిమాతో..

Hero Prabhas: రాధేశ్యామ్‌ టీమ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన డార్లింగ్‌ ప్రభాస్‌... ఖుషీ అవుతోన్న యూనిట్‌ సభ్యులు..
Follow us on

Prabhas Gift To Movie Unit: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాహుబాలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇప్పుడీ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు యావత్‌ భారతీయ సినిమా ప్రపంచం ఎదురుచూస్తోంది. దీనికి తగ్గట్లుగానే ప్రభాస్‌ తన తర్వాతి చిత్రాలను ఓ రేంజ్‌లో  ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక స్టార్‌డమ్‌ విషయంలో ఎంత ఎదిగినా.. అంతే ఒదిగి ఉంటాడు ప్రభాస్‌. తనతో పాటు ఉండేవారికి ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ బహుమతులను ఇస్తూ ఆకట్టుకుంటాడు.
ఈ క్రమంలోనే తాజాగా ‘రాధేశ్యామ్‌’ చిత్ర యూనిట్‌ సభ్యులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. వైరల్‌గా మారిన పోస్ట్‌ల ఆధారంగా ప్రభాస్‌ అతని చిత్ర యూనిట్‌ సభ్యులకు.. టైటాన్, ట్రాక్ పేరుతో గల వాచ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం.. ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా, కేజీఎఫ్‌ దర్శకుడితో ఒక సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Love Story Movie : ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ సంక్రాంతి పోస్టర్.. రొమాంటిక్ లుక్ లో చైతు-సాయిపల్లవి