Love Story Movie : ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ సంక్రాంతి పోస్టర్.. రొమాంటిక్ లుక్ లో చైతు-సాయిపల్లవి

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ 'లవ్ స్టోరీ' ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Love Story Movie : ఆకట్టుకుంటున్న 'లవ్ స్టోరీ' సంక్రాంతి పోస్టర్.. రొమాంటిక్ లుక్ లో చైతు-సాయిపల్లవి
Follow us

|

Updated on: Jan 14, 2021 | 6:57 PM

Love Story Movie : టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ ‘లవ్ స్టోరీ’ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ మూవీలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. జీవితంలో ఎదో సాధించాలని పల్లెను వదిలి సిటీకి వచ్చిన యువకుడిగా చైతన్య కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సాయి పల్లవి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమానుంచి సంక్రాంతి సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చైతన్య క్యాజువల్ షర్ట్ లో, సాయిపల్లవి లంగావోణిలో ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ‘సైకో’.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్

‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’.. పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్..!