BREAKING NEWS : అలస్కాలో సునామీ హెచ్చరికలు

అలస్కా తీర ప్రాంతంలో  7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో...

BREAKING NEWS : అలస్కాలో సునామీ హెచ్చరికలు

Updated on: Jul 23, 2020 | 7:40 AM

The Tsunami Warning : అలస్కా తీర ప్రాంతంలో  7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సైరన్‌ మోగిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరం, పెర్రివిలెకు ఆగ్నేయం దిశగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూ ప్రకంపనల తీవ్రత అధికండా ఉండటంతో 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

అయితే.. భూకంపం తర్వాత చాలాసేపటి వరకు సాధారణ అలలు మాత్రమే రికార్డవ్వడంతో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. అప్పటికే వేగంగా కొడియాక్‌ దీవుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ప్రమాదకర అలలేవీ రాలేదని తీర ప్రాంత అధికారులు తెలిపారు. వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.