COVID Vaccine : కరోనా వ్యాక్సిన్ విషయంలో శుభపరిణామం.. డీసీజీఐ సమావేశంలో ఏ కంపెనీకి అవకాశం..

|

Jan 01, 2021 | 9:33 AM

COVID Vaccine : కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు

COVID Vaccine : కరోనా వ్యాక్సిన్ విషయంలో శుభపరిణామం.. డీసీజీఐ సమావేశంలో ఏ కంపెనీకి అవకాశం..
Follow us on

COVID Vaccine : కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు అనుకూలంగా ఇవాళ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభించే అవకాశం ఉంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద 3 సంస్థల దరఖాస్తులు ఉన్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు వ్యాక్సిన్ అందించేందుకు సిద్దంగా ఉన్నాయి.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో కలిసి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థ అలాగే ఐసీఎంఆర్ సాయంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ సంస్థ. సీరం టీకా ‘కోవిషీల్డ్’, భారత్ బయోటెక్ టీకా ‘కోవాక్సిన్’ పత్రాలను ఇప్పటికే డీసీజీఐ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ పరిశీలించింది. అయితే ఫైజర్ సంస్థ అదనపు సమాచారం ఇచ్చేందుకు కొద్దిగా సమయం కోరింది. ఇప్పుడు ఈ సంస్థ ఇచ్చే సమాచారంపై డీసీజీఐ సబ్జెక్ట్ ఎక్స్‌పర్స్ట్ కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉంటే సీరం టీకా ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి యూకే ఆమోదం తెలిపింది.మొదటి 5 కోట్ల డోసులను భారత్‌కే ఇస్తామని ప్రకటించింది. ఎగుమతులకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదం, లైసెన్స్ అవసరం తప్పనిసరి కావడంతో అవి వచ్చేలోపు తయారయ్యే డోసులను దేశంలోనే వినియోగించుకునే అవకాశం ఉంది. సీరం టీకా ‘కోవిషీల్డ్’ను సాధారణ రిఫ్రిజిరేటర్ (2℃-8℃ ఉష్ణోగ్రత) మధ్య భద్రపర్చడం ఇప్పటి వరకు అనుకూలాంశంగా ఉంది.