రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు దశలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతగా 197 మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలివిడతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడతలో సమస్యాత్మకంగా గుర్తించిన 217 ఎంపీటీసీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.