అనపర్తి హీట్: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ, ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకు గణపతి దేవుని సాక్షిగా ప్రమాణాల పరంపర.!

|

Dec 23, 2020 | 7:35 AM

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. సూర్యనారాయణరెడ్డి వర్సెస్ రామకృష్ణా రెడ్డి. రాజకీయంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండుతోంది..

అనపర్తి హీట్: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ, ఇవాళ మధ్యాహ్నం రెండున్నరకు గణపతి దేవుని సాక్షిగా ప్రమాణాల పరంపర.!
Follow us on

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. సూర్యనారాయణరెడ్డి వర్సెస్ రామకృష్ణా రెడ్డి. రాజకీయంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండుతోంది. తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎక్కుపెడితే.. గణపతి దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తా. నేనొక్కడినే కాదు.. ఫ్యామిలీతో సహా ప్రమాణం చేస్తామంటూ సవాలు విసిరారు ఎమ్మెల్యే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఆ ముహూర్తం. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. పొలిటికల్‌ టెన్షన్‌తో పోలీసులు అటెన్షన్‌లో ఉన్నారు. 336 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులు ఉన్నారు. ఇంతకీ ఇవాళ అనపర్తిలో ఏం జరగనుంది? చెప్పినట్టుగానే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అక్కడికి వస్తారా..? లేక ముందుగానే అరెస్టు చేస్తారా..? ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో బిక్కబోలు ఊపిరి బిగపట్టి చూస్తోంది.

ఇక.. రాజకీయ ప్రమాణాలకు బిక్కవోలు గణపతి ఆలయం వేదికకాబోతోంది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అక్రమ గ్రావెల్ మైనింగ్ పర్మిషన్లు, నాటు సారా, పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారని, వాటిని సాక్షాలతో నిరూపిస్తానంటున్నారు. అయితే తాను ఎలాంటి అక్రమాలు చేయలేదంటూ గణపతి ఆలయంలో భార్యతో సహా ప్రమాణానికి రెడీ అయ్యారు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. 144 సెక్షన్‌ ఉన్నందున గుడిలోకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా.. రాకపోయినా.. ప్రమాణానికి రెడీ అంటున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పోలీసు ఆంక్షలు లేకపోతే పదివేల మంది సత్య ప్రమాణానికి హాజరయ్యేవారన్నారు. మరోవైపు – వెన్నుచూపడం మా ఇంటావంటా లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తిలో 144 సెక్షన్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి చర్చనుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలకు రుజువులు ఉన్నాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. పనిలో పనిగా మరో మూడు డిమాండ్లు పెట్టి తేల్చుకుందాం రా అంటూ సవాల్‌ విసిరారు.