perni nani murder attempt case: ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. ఘటనకు సంబంధించినసీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ విజువల్స్‌లో… నాగేశ్వరరావు కసితో మంత్రి నానిని చంపాలని ప్రయత్నించాడని పోలీసు నిర్దారణకు వచ్చారు.
రెండు రోజుల కిందట బందరులోని పేర్ని నాని ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. తన తల్లి పెద్ద కర్మ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చారు మంత్రి. అప్పటి వరకు గేట్ దగ్గరే వెయిట్ చేశాడు నాగేశ్వరరావు. అందరితో పాటు అక్కడే నిలబడ్డాడు. ప్లాన్ ప్రకారం… తాపీని జేబులో పెట్టుకొచ్చాడు. మంత్రి బయటకు రాగానే… అదును చూసి తాపీతో పొట్టలో పొడవబోయాడు. పేర్ని పెట్టుకున్న బెల్ట్‌కు ఉన్న బకిల్‌కు తాపీ బలంగా తాకడంతో… ప్రమాదం తప్పింది. తాపీ వంకర పోయింది. దీంతో మరోసారి పొడవడానికి ప్రయత్నించాడు నాగేశ్వరరావు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అయితే, నాగేశ్వరరావు మొదటిసారి ప్రయత్నించిన వెంటనే మంత్రి అనుచరులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆలోపే మరోసారి పొడవడానికి ప్రయత్నించాడు నాగేశ్వరరావు. అప్పటికే అతడిని పట్టుకోవడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నాగేశ్వరరావును విచారణ జరుపుతున్నారు.