కరోనా వ్యాప్తి ప్రభావం వినాయక ఉత్సవాలపై పడుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తును ఈ ఏడాది తగ్గించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసులు. కొన్ని పరిమితులను విధించారు. తయారీ దారులు, నిర్వాహకులు సైతం తప్పకుండా వాటిని పాటించేలా కేపీహెచ్‌బీ పోలీసులు అవగాణ కల్పిచేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా ఈ సారి వినాయక నవరాత్రోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించేలా ఉత్సవ నిర్వహాకులకు అవగాహన కల్పించనున్నారు. వినాయక ప్రతిమలను తయారు చేసే తయారీ దారులకు గరిష్టంగా మూడు అడుగుల మట్టి విగ్రహాలనే తయారు చేయాలని సూచిస్తున్నారు. అంతకు మించి ఎత్తులో విగ్రహాలు త యారు చేయవద్దంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విగ్రహాల తయారీ దారులను గుర్తించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో తయారీదారులందరితో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.