ఊరు చివర..పైగా మామిడితోట..ఆపై కరోనా ఇయర్ ఎండింగ్ మూడ్, గుట్టుగా సాగుతోంది యవ్వారం.. మందేసి చిందేస్తున్నారంతా.. సడెన్ గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారీ తన ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అమ్మాయిలతో చిందులు వేశారు. సన్నిహతులకు ఘనంగా విందు ఇచ్చారు…ఈ పార్టీలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. డీలర్లకు మందు పార్టీ పేరుతో అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా, కీసరలో జరిగిన ఓ రేవ్ పార్టీలో కలకలం చెలరేగింది.