ప్రధాని మోదీ పర్సనల్ వెబ్‌సైట్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!

సైబర్ నేరగాళ్లు దేశ ప్రధానిని కూడా వదలలేదు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ పర్సనల్ వెబ్‌సైట్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!
Follow us

|

Updated on: Sep 03, 2020 | 8:42 AM

సైబర్ నేరగాళ్లు దేశ ప్రధానిని కూడా వదలలేదు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. అయితే, వెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్లను డిలీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. ట్విట్టర్ అకౌంట్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలని కొంత సొమ్మును పంపాలంటూ కోరారు. మోదీ ట్విట్టర్ అకౌంట్‌ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు జాన్ విక్. ఈ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీ కేసులో హస్తముందనే ఆరోపణలున్నాయి. పేటీఎం మాల్ యూనిఫార్మ్ అనేది పేటీఎంకు చెందిన ఈ కామర్స్ కంపెనీ. కాగా, ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు 25 లక్షలకు మించిన ఫాలోవర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర సైబర్ క్రైంవిభాగం దర్యాప్తు చేపట్టింది.

జులైలో పలువురు ప్రముఖుల ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్సనల్ ట్విట్టర్ ను కూడా దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకర్లబారిన పడ్డవారిలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జోయ్ బైడెన్, మైక్ బ్లూమ్‌బర్గ్, అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సహా పలువురు బిలియనీర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర నిఘా విభాగంగా దర్యాప్తు ముమ్మరం చేసింది.