న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లు దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.పవిత్రమైన హోళీ పండుగ సందర్భంగా ప్రతి ఒక భారతీయుడికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ మన ఐక్యతను చాటుతుందన్నారు. కరుణకు ఇది నిదర్శనమన్నారు.
होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास का यह त्योहार हमारी एकता और सद्भावना के रंग को और प्रगाढ़ करे। pic.twitter.com/glZ6eQHaoe
— Chowkidar Narendra Modi (@narendramodi) March 21, 2019
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దేశప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఆయన హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగ ప్రజల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని తెస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తన ట్వీట్‌లో తెలిపారు.
Greetings and best wishes to fellow citizens in India and abroad on the auspicious occasion of Holi. The festival of colours, Holi is a celebration of spring and fraternity in our society. May it bring peace, joy and prosperity to everyone’s lives #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) March 21, 2019