PM Narendra Modi : వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలను నిర్మూలించాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ నుంచి ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విధానం-2020 జాతి అభివృద్ధి దిశగా పడిన కీలక ముందడుగు అని ప్రధాని అన్నారు. యువతకు మంచి అవకాశాలను కల్పించే వ్యవస్థను దేశంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ఒక సవాలుగా మారాయని అన్నారు. అవి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువన్నారు. వాటిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని మోదీ – యువతకు పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రైతుల ఆందోళన.. సుప్రీం కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఇలా ఉన్నాయి..