దేశ ప్రజలకు మోదీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు

|

Oct 17, 2020 | 11:37 AM

కొవిడ్ రాకాసి పుణ్యామాన్ని ఈ ఏడాది పండుగలన్నీ సాదాసీదా సాగిపోతున్నాయి. అట్టహాసంగా జరగాల్సిన ఉత్సవాలు భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జరుపుకుంటున్నారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి శుభాకాంక్షలు తెలిపారు

దేశ ప్రజలకు మోదీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు
Follow us on

కొవిడ్ రాకాసి పుణ్యామాన్ని ఈ ఏడాది పండుగలన్నీ సాదాసీదా సాగిపోతున్నాయి. అట్టహాసంగా జరగాల్సిన ఉత్సవాలు భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జరుపుకుంటున్నారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు. మీమీ జీవితాల్లో అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆ జగదంబను ప్రార్థిస్తున్నా. నవరాత్రుల్లో మొదటి రోజైన శైలపుత్రి రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం. అమ్మ ఆశీర్వాదంతో మన మన గృహాలు సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి. అమ్మ ఆశీర్వాదంతో పేద ప్రజల జీవితాల్లో ఓ సానుకూల మార్పు సాధ్యమవుతుంది. ఓం శైలపుత్ర్యై నమః’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండిః డ్రోన్లను అడ్డుకునే సత్తా ఎన్ఎస్ గార్డ్సుకు ఉందిః దేస్వాల్