బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం నాలుగు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. చాప్రా, సమస్తిపూర్, మోతీహారి, బగాహా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ అతిపెద్ద ‘ప్రజాస్వామ్య పండుగ’ లో నేను బీహార్ ప్రజల ఆశీస్సులను పొందదలిచాను’ అని ఆయన ట్వీట్ చేశారు. ఛాప్రా లో మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా ఎక్కువగా ఉంది. అయితే అవినీతి కేసులో జైలుపాలైన ఆయన మొదటిసారిగా ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఇప్పటివరకు ఆరు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరో 16 ప్రచార సభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉంది. ఈ నెల 3 న రెండో దశ, 7 న మూడో (తుది) దశ ఎన్నికలు జరగనున్నాయి.