బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ. 16 వేల కోట్ల విలువైన ‘తాయిలాలు’

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ..ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. రూ. 16 వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన ప్రకటించారు. రానున్న 10 రోజుల్లో వీటికి శ్రీకారం చుట్టి బీహార్ ని మరింత..

బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ. 16 వేల కోట్ల విలువైన  తాయిలాలు

Edited By:

Updated on: Sep 12, 2020 | 12:51 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ..ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. రూ. 16 వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన ప్రకటించారు. రానున్న 10 రోజుల్లో వీటికి శ్రీకారం చుట్టి బీహార్ ని మరింత పురోగమింపజేస్తామన్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మల్టిపుల్ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. పైగా ఈ పది రోజుల్లో వివిధ ఈవెంట్ల సందర్భంగా పలు  వర్గాల ప్రజలతో మోదీ  ఇంటారాక్ట్ కానున్నారు. వచ్ఛే అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి లేకపోతే ఈ పాటికే ఎన్నికల కమిషన్ బీహార్ సహా ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి మార్గదర్శకసూత్రాలను రూపొందించి ఉండేది.