ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్ననేపథ్యంలోనే కేంద్ర అఖిలపక్షం భేటీ కానుంది. కాగా బడ్జెట్ సెషన్స్ ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ సమావేశం వర్చువల్ విధానంలో సాగనుంది.
కరోనా నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి రెండు విడుతలుగా జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి. తొలి విడుత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, రెండో విడుత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందున రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగనుంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్ ప్రతులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. కాగా పార్లమెంట్ సభ్యులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.