మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ లో పేర్కొన్నప్పటికీ, ఏ విషయం మీద మాట్లాడతారన్నది స్పష్టం కాలేదు. దేశంలో ఈ పండుగల సమయంలో కరోనా వైరస్ పరిస్థితిగురించి ఆయన ప్రస్తావించవచ్చునని భావిస్తున్నారు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు 76 లక్షలకు చేరుకున్నాయి.అయితే మొదటిసారిగా మూడు నెలల తరువాత ఒక రోజులో 50 వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 46,790 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసులు 75,97,063 అని వివరించింది. గత జులై 23 న 45,720 కేసులు నమోదయ్యాయి.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
— Narendra Modi (@narendramodi) October 20, 2020