అభివృధ్ది కోసం నితీష్ ప్రభుత్వం ఉండాల్సిందే, ప్రధాని మోదీ
బీహార్ అభివృధ్డి కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇది నాకు అవసరం..అభివృధ్ది పథం నుంచి రాష్ట్రం వైదొలగరాదు..అని ఆయన.. బీహార్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో ఓట్లు కుల ప్రాతిపదికపై కాక, పురోగతి ప్రాతిపదికపై పోలవుతున్నాయని ఆయన అన్నారు. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వ శక్తి (జేడీయూ-బీజేపీ) బీహార్ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి తోడ్పడుతుందని మోడీ అన్నారు. ఎన్డీయే ఈ రాష్ట్రానికి విద్యుత్తు, […]

బీహార్ అభివృధ్డి కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇది నాకు అవసరం..అభివృధ్ది పథం నుంచి రాష్ట్రం వైదొలగరాదు..అని ఆయన.. బీహార్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో ఓట్లు కుల ప్రాతిపదికపై కాక, పురోగతి ప్రాతిపదికపై పోలవుతున్నాయని ఆయన అన్నారు. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వ శక్తి (జేడీయూ-బీజేపీ) బీహార్ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి తోడ్పడుతుందని మోడీ అన్నారు. ఎన్డీయే ఈ రాష్ట్రానికి విద్యుత్తు, నీరు, రోడ్లు, ఆరోగ్యం, విద్య అన్నీ సమకూర్చిందని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని మోదీ కోరారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
बिहार के भाइयों और बहनों के नाम मेरा पत्र… pic.twitter.com/QZ2qOlF8XD
— Narendra Modi (@narendramodi) November 5, 2020