
Property Cards : కేంద్రం తీసుకొచ్చిన స్వమిత్వా పథకం గ్రామీణ భారతం రూపురేఖలు మారిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. డ్రోన్ టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో భూరికార్డులను అప్‌డేట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని అన్నారు. భూముల మ్యాపింగ్, సర్వేతో గ్రామాల ల్యాండ్ రికార్డు పర్‌ఫెక్ట్‌గా తయారవుతోందని తెలిపారు.
గ్రామాల్లో స్వమిత్వా పథకంతో చాలా అభివృద్ది జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. నగరాల లాగే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందని వెల్లడించారు. స్వమిత్వా పథకం కింద ఆస్తి కార్డులను పంపిణీని పీఎం మోదీ చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఆస్తి ద్వారా రుణాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని.. భూ వివాదాలకు స్వస్తి పలకడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రాపర్టీ హక్కు కల్పించడం వంటివి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ వెల్లడించారు.