అన్నదాతల సంక్షోభ పరిష్కారానికి నేరుగా ప్రధాని మోదీ జోక్యం మేలు, ఎన్సీపీ నేత శరద్ పవార్

| Edited By: Pardhasaradhi Peri

Feb 07, 2021 | 12:39 PM

రైతుల సమస్యను పరిష్కరించేందుకు నేరుగా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం మంచిదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. వ్యవసాయ చట్టాల..

అన్నదాతల సంక్షోభ పరిష్కారానికి నేరుగా ప్రధాని మోదీ జోక్యం మేలు, ఎన్సీపీ నేత శరద్ పవార్
Follow us on

రైతుల సమస్యను పరిష్కరించేందుకు నేరుగా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం మంచిదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ నిరశన చేస్తున్న అన్నదాతలు కూడా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అంటే తనకు అగౌరవం లేదని, కానీ రైతుల  సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఓ సీనియర్ మంత్రి ఎవరైనా చొరవ తీసుకుంటే బాగుంటుందని శరద్ పవార్ అన్నారు. ఈ సంక్షోభం  త్వరగా ముగియాలి. అందుకు నేరుగా ప్రధాని మోదీ..లేదా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చొరవ తీసుకుని ముందుకు రావాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్య ఇన్ని నెలలుగా కొనసాగడం మంచిది కాదని కూడా ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వఛ్చినప్పటి నుంచి ఈ విధమైన ఉదంతాలు ఎన్నడూ జరగలేదన్నారు.

రైతుల సమస్యపై కొన్ని దేశాలు స్పందించి ఇండియాకు సూచనలు చేస్తే..ఇది మా అంతర్గత సమస్య ..మీరు జోక్యం చేసుకోజాలరని అంటూ కేంద్రం ఖండించడాన్ని కూడా శరద్ పవార్ తప్పు పట్టారు. లోగడ  ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉండగా ట్రంప్ మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నికవుతారని వ్యాఖ్యానించినట్టు,, దీన్ని కొందరు ప్రశంసించినట్టు తనకు గుర్తు అని, ఇప్పుడు  రైతుల సమస్యపై మళ్ళీ  విదేశాలనుంచి కొందరు ఇలాగే స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏమైనా, అటు ప్రభుత్వం, ఇటు అన్నదాతలు పట్టువిడుపులకు పోకుండా సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ పవార్ కోరారు.

 

Read More:

Ankita Lokhande: సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలి డ్యాన్స్ సూపర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

రైతులు మీకు గాంధీ జయంతి వరకు గడువునిచ్చారు..ఇప్పటికైనా స్పందించండి.. రాహుల్ గాంధీ.