మీ ప్రాంతాల‌లో కొత్తవారు కనిపిస్తే వెంట‌నే సమాచారం ఇవ్వండి…

|

May 13, 2020 | 10:11 PM

తెలంగాణ‌లో పట్టణాలు, గ్రామీ‌ణ ప్రాంతాల్లో కొత్తవారు కనిపించినా, వలస కూలీల జాడ ఉన్నా… ప్రజలు స్థానిక అధికారులకు వెంటనే సమాచారమివ్వాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ కాల్‌సెంటర్‌ 104కు కూడా ఫోన్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వలస జీవుల్లో కరోనా ప్రైమ‌రీ టెస్టులు నిర్వహించడానికి జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 87 చెక్‌పోస్టుల వద్ద 275 మంది హెల్త్ టీమ్స్ నియమించినట్లు పేర్కొన్నారు. ఇలా చెయ్య‌డం ద్వారా రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని […]

మీ ప్రాంతాల‌లో  కొత్తవారు కనిపిస్తే వెంట‌నే సమాచారం ఇవ్వండి...
Follow us on

తెలంగాణ‌లో పట్టణాలు, గ్రామీ‌ణ ప్రాంతాల్లో కొత్తవారు కనిపించినా, వలస కూలీల జాడ ఉన్నా… ప్రజలు స్థానిక అధికారులకు వెంటనే సమాచారమివ్వాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ కాల్‌సెంటర్‌ 104కు కూడా ఫోన్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వలస జీవుల్లో కరోనా ప్రైమ‌రీ టెస్టులు నిర్వహించడానికి జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 87 చెక్‌పోస్టుల వద్ద 275 మంది హెల్త్ టీమ్స్ నియమించినట్లు పేర్కొన్నారు. ఇలా చెయ్య‌డం ద్వారా రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని..అంద‌రి ఆరోగ్యాల‌కు కూడా మంచిద‌ని సూచించారు.