Indian railways new coaches: విమానాన్ని తలపిస్తోన్న ఇండియన్ రైల్వే కొత్త కోచ్‌లు.. ‘ఇకపై రైలు ప్రయాణం మరపురాని జ్ఞాప‌కం’

|

Dec 30, 2020 | 2:33 PM

Indian railways new coaches: ఇకపై భారత రైల్వే కోచ్‌లు విమానాన్ని తలపించనున్నాయి. అత్యంత సౌకర్యవంతంగా, అధునాతనంగా రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో భాగంగా...

Indian railways new coaches: విమానాన్ని తలపిస్తోన్న ఇండియన్ రైల్వే కొత్త కోచ్‌లు.. ‘ఇకపై రైలు ప్రయాణం మరపురాని జ్ఞాప‌కం’
Follow us on

Piyush tweet about new railway coaches: ఇకపై భారత రైల్వే కోచ్‌లు విమానాన్ని తలపించనున్నాయి. అత్యంత సౌకర్యవంతంగా, అధునాతనంగా రూపుదిద్దుకోనున్నాయి. ఇందులో భాగంగా భారతీయ రైల్వే శాఖ తాజాగా ‘విస్టాడోమ్’ టూరిస్టూ కోచ్‌లకు సంబంధించిన స్పీడ్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. గంటకు సుమారు 180 కి.మీల వేగాన్ని తట్టుకునేలా రూపొందించడం ఈ కోచ్‌ల ప్రత్యేకత.

ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు.. ‘ఈ కొత్త కోచ్‌లు ప్రయాణికులకు ప్రయాణాన్ని కేవలం జర్నీలా కాకుండా మరిచిపోలేని ఒక మరుపురాని జ్ఞాప‌కంగా మార్చనున్నాయి. భారత రైల్వే ప్రవేశపెట్టనున్న కొత్త కోచ్‌లను ఓసారి చూడండి’ అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ కొత్త కోచ్‌లకు సంబంధించి ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కొత్త కోచ్‌ల ప్రత్యేకతలు..
ఇండియన్ రైల్వే ప్రవేశ పెట్టనున్న ఈ విస్టాడోమ్ కోచ్‌లలో భారీ స్థాయిలో అద్దాలు (విండోస్) ఉంటాయి. దీంతో ప్రకృతి అందాలను వీక్షిస్తూ ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణికులు తాము వెళ్లే రూట్‌కు సంబంధించిన లొకేషన్‌ను ఈ కోచ్‌లలో రియల్ టైమ్‌లో చూడొచ్చు. ఒక్కో కోచ్‌లో 44 సీట్లు ఉండగా.. వీటిని 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ కొత్త కోచ్‌లను ప్రస్తుతానికి దాదర్. దాద‌ర్‌-మ‌డ‌గావ్‌, అర‌కు లోయ‌, క‌శ్మీర్ లోయ‌, డార్జిలింగ్ హిమాల‌య‌న్ రైల్వే, క‌ల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేర‌న్ హిల్ రైల్వే, నీల‌గిరి మౌంటేన్ ప్రాంతాల్లో న‌డ‌ప‌నున్నారు.

 

Also read: Vijayawada Mumbai Flight: జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య ‘ఇండిగో’ విమాన సర్వీసులు..