పీహెచ్‌సీల్లో యాంటిజెన్ టెస్టులు.. బారులు తీరిన జనం..

| Edited By:

Jul 22, 2020 | 2:13 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నగరంలోని పీహెచ్‌సీ పరిధుల్లో యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోంది. దీంతో ఈ పరీక్ష కేంద్రాల

పీహెచ్‌సీల్లో యాంటిజెన్ టెస్టులు.. బారులు తీరిన జనం..
Follow us on

People in queue for Coronavirus tests: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నగరంలోని పీహెచ్‌సీ పరిధుల్లో యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోంది. దీంతో ఈ పరీక్ష కేంద్రాల వద్ద టెస్టులు చేయించుకునేందుకు జనం బారులు తీరారు. అన్ని పీహెచ్‌సీ కేంద్రాల వద్ద ఈ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే రోజూ 6వేలకుపైగా టెస్టులు నిర్వహిస్తున్నారు.

కరోనా కట్టడికోసం ప్రభుతం పలు చర్యలు చేపడుతోంది. అయితే, రోజుకు వందమందికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో బాధితులు కొంత ఇబ్బందికి గురవుతున్నారు. మిగిలినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అయితే నిమిషాల్లో రిజల్ట్ వస్తుండడంతో యాంటిజెన్ టెస్టుల కోసం జనాలు క్యూకడుతున్నారు. మొత్తంగా హైదరాబాద్‌లో కరోనా పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది.

Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..