Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

|

Sep 18, 2020 | 3:34 PM

అందరిని ఆశ్చర్యపరుస్తూ.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడింది. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేసే యాప్‌ను తాము ఆమోదించబోమని.. అందుకే తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది.

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!
Follow us on

అందరిని ఆశ్చర్యపరుస్తూ.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడింది. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేసే యాప్‌ను తాము ఆమోదించబోమని.. అందుకే తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది. శుక్రవారం గూగుల్ తన బ్లాగ్‌లో ”Understanding Our Play Gambling Policies In India” అనే టైటిల్‌తో ఓ ప్రచురణ చేసింది. అందులో కొత్త మార్గదర్శకాల గురించి ప్రస్తావించింది. ముఖ్యంగా భారతదేశంలో జుదాన్ని ఆమోదించే, ప్రోత్సహించే యాప్స్‌కు సంబంధించిన సమస్యలను హైలైట్ చేసింది. (Paytm pulled from Google Play Store)

“వినియోగదారుల సురక్షితను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ప్లేను రూపొందించాం. అదే సమయంలో డెవలపర్‌లకు స్థిరమైన వ్యాపారాలను నిర్మించడానికి అవసరమైన వేదికను కూడా ఇది ఇస్తుంది. మా గ్లోబల్ పాలసీలు ఎల్లప్పుడూ ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడతాయి. మా వాటాదారులందరి మంచిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం” అని గూగుల్ తన బ్లాగులో తెలిపింది. అంతేకాదు పేటీఎం యాప్ ద్వారా లభించే ఆన్‌లైన్ కాసినోల సమస్యను ఇందులో చర్చించింది. కాగా, గూగుల్  ప్లేస్టోర్‌లో పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్‌లు ఉన్నాయి.

Also Read:

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!