రోడ్ల పై చెత్త వేస్తే.. రూ. 40వేల జరిమానా..

| Edited By: Pardhasaradhi Peri

Jul 03, 2019 | 3:05 PM

హైదరాబాద్ నగర రోడ్ల పై చెత్తా, చెదారం వేస్తున్న వారి పై జీహెచ్‌ఎంసీ కొరడా ఝళిపిస్తోంది. పరిశుభ్రంగా ఉండాల్సిన రహదారుల్లో చెత్త చెదారం వేస్తే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది నగర పాలక సంస్థ. చెత్త వేయడమే కాకుండా.. గుట్కా, పాన్ వంటివి తిని.. రోడ్ల పై ఉమ్మివేసినా వారి పని ఔట్ అంటోంది. ఇందులో భాగంగా రోడ్ల పై చెత్త వేస్తున్న ఇద్దరికి రూ. 40 వేల జరిమానా విధించారు. చందానగర్ వెంకటాద్రి కాలనీకి […]

రోడ్ల పై చెత్త వేస్తే.. రూ. 40వేల జరిమానా..
Follow us on

హైదరాబాద్ నగర రోడ్ల పై చెత్తా, చెదారం వేస్తున్న వారి పై జీహెచ్‌ఎంసీ కొరడా ఝళిపిస్తోంది. పరిశుభ్రంగా ఉండాల్సిన రహదారుల్లో చెత్త చెదారం వేస్తే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది నగర పాలక సంస్థ. చెత్త వేయడమే కాకుండా.. గుట్కా, పాన్ వంటివి తిని.. రోడ్ల పై ఉమ్మివేసినా వారి పని ఔట్ అంటోంది. ఇందులో భాగంగా రోడ్ల పై చెత్త వేస్తున్న ఇద్దరికి రూ. 40 వేల జరిమానా విధించారు.

చందానగర్ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్ రెడ్డి భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు రూ. 30 వేల జరిమానా విధించారు. రోడ్డు పై చెత్త వేయడంతో పాటు డస్ట్‌బిన్‌లను సైతం ఏర్పాటు చేసుకోకపోవడంతో.. మూసాపేటలోని సాయిబాలాజీ వైన్స్‌కు రూ. 10 వేల జరిమానా విధించారు. ఇకనుంచి రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా ఫైన్ కట్టాల్సిందేనని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.