Hero Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పోస్టర్..

|

Jan 20, 2021 | 9:39 PM

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఆ సినిమా

Hero Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కామిక్ బుక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పోస్టర్..
Follow us on

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఆ సినిమా తర్వాత పవన్ ‘అయ్యప్పనమ్ కోషియం’  మూవీ  తెలుగు రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే డైరెక్టర్ క్రిష్‏తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‏లో సూపర్ హిట్ సాధించిన పింక్ మూవీని తెలుగులో రీమేక్ వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నరు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‏కు విశేషస్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ అభిమానుల ముందుకు రానుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని వకీల్ సాబ్ సినిమా పై చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్ అంటూ నిఖిల్ అనుదీప్ అనే నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోను వెరైటీగా డిజైన్ చేసి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఇక అదికాస్త సోషల్ మీడియోలో వైరల్‏గా మారింది.

Also Read:

తెలుగులో రీమేక్ కానున్న ‘కొరియన్’ సినిమా.. అధికారికంగా ప్రకటించిన పాపులర్ నిర్మాణ సంస్థ.. త్వరలోనే షూటింగ్..

పవర్‌స్టార్‌తో సినిమా.. ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన పవన్ కల్యాణ్‌..!