పవన్ ట్వీట్.. ఎగిరిగంతేసిన యువ హీరో

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒ​క్కరికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేసినవారిలో తమిళహీరో శివకార్తికేయన్‌ కూడా ఉన్నారు.

పవన్ ట్వీట్.. ఎగిరిగంతేసిన యువ హీరో

Updated on: Sep 04, 2020 | 3:32 PM

Pawan Kalyan : పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒ​క్కరికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేసినవారిలో తమిళహీరో శివకార్తికేయన్‌ కూడా ఉన్నారు.

‘హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్‌ సార్‌’ అంటూ కార్తికేయన్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్‌ కల్యాణ్‌ రిప్లై ఇచ్చారు. ‘డియర్‌ తిరు శివ కార్తితీకేయన్‌ మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాకు మీ సినిమాలోని ‘ఊదా కలర్‌ రిబ్బన్‌’ అనే పాట చాలా ఇష్టం. దానిని నేను లెక్కలేనన్ని సార్లు చూశాను’ అని రిప్లై ఇచ్చారు.

పవర్‌స్టార్‌ స్వయంగా రిప్లై ఇవ్వడంతో శివకార్తికేయన్‌ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. సూపర్‌స్టార్‌ అయి ఉండి తన విలువైన సమయాన్ని వెచ్చించి తన పాటను చూసి ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసినందుకు పవర్‌ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపారు.


ఊదారంగు రిబ్బన్‌ పాట శివకార్తికేయన్‌ నటించిన వరుతపదత వాలిబార్ సంగం చిత్రంలోనిది. ఈ చిత్రంలోని అన్ని పాటలు మంచి ఆదరణను పొందాయి.