సీమపై పవన్ నజర్.. 6రోజులపాటు ఏం చేస్తారంటే?

|

Nov 26, 2019 | 5:00 PM

విజయవాడ వేదికగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రాయలసీమపై దృష్టి సారించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం ద్వారా జనసేన పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో డిసెంబర్ 1 నుంచి ఏకంగా ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో సమాలోచనలు జరపాలని పవన్ భావిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక […]

సీమపై పవన్ నజర్.. 6రోజులపాటు ఏం చేస్తారంటే?
Follow us on

విజయవాడ వేదికగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రాయలసీమపై దృష్టి సారించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం ద్వారా జనసేన పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో డిసెంబర్ 1 నుంచి ఏకంగా ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు.

రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో సమాలోచనలు జరపాలని పవన్ భావిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆయన అనుకుంటున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. సంక్షేమ పథకాల లబ్ది అర్హులకు అందించడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారిని కలవాలని జనసేన చీఫ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబరు 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్ళ నున్న పవన్ కల్యాణ్.. మద్యాహ్నం 3 గంటలకు రైల్వే కోడూరులో కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు.

ఆ తర్వాత తిరిగి తిరుపతి చేరుకుని అక్కడ రాత్రికి బస చేస్తారు. డిసెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష జరుపుతారు. 4వ తేదీ మదనపల్లెలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

5వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చలు కొనసాగిస్తారు. 6వ తేదీన పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు. అదేరోజు బెంగళూరు మీదుగా హైదరాబాద్ వస్తారని జనసే వర్గాలు తెలిపాయి.