జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ నెల 3 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్‌ను (సవరణ) బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దుకు పదికిలోమీటర్ల పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుంది.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూను మరోమారు టార్గెట్ చేశారు. కశ్మీర్ సమస్యకు మూలకారకుడు ఆయనేనని విరుచుకుపడ్డారు. కశ్మీర్ రాజుతో ఒప్పందం తర్వాత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయిందన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ విషయంలో వాజ్‌పేయి అడుగుజాడల్లో నడుస్తామన్నారు.
Rajya Sabha approves statutory resolution to extend President's rule in J&K for a further period of 6 months with effect from 3rd July 2019; Also passes J&K Reservation (Amendment) Bill, 2019. pic.twitter.com/SkbbXnf1UV
— ANI (@ANI) July 1, 2019
Union Home Minister Amit Shah in Rajya Sabha: After Maharaja's treaty with Union of India, Kashmir became India's integral part, what was the need to go to UN?Was it not a mistake, if we don't learn from & accept our mistakes the coming generations will also keep making mistakes. https://t.co/WeO07aEluG
— ANI (@ANI) July 1, 2019
Both Houses of Parliament unanimously passed two important bills pertaining to Jammu and Kashmir. These bills were passed after rich debates, enriched by participation of MPs across party lines.
I thank all parties for their support.
Such bipartisan support is gladdening.
— Narendra Modi (@narendramodi) July 1, 2019
Passage of Jammu and Kashmir Reservation (Amendment) Bill ensures justice for those living in the border areas of Kathua, Samba & Jammu districts.
The aspirations of the bright and talented youth of these areas will be fulfilled, which is wonderful for the state and our nation.
— Narendra Modi (@narendramodi) July 1, 2019