భారీగా గబ్బిలాల మృతి…రెండు రాష్ట్రాల్లో కలకలం

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 12:18 PM

కొవిడ్ వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల పాటుచుట్టేసిన వార్త…కానీ వైరస్ పుట్టుకపై క్లారిటీ రాలేదు. కరోనా మాత్రం ప్రపంచాన్ని వణికిస్తోంతి. అయితే తాజాగా భారతదేశంలోని రెండు రాష్ట్రాల్లో గబ్బిలాలు పెద్ద ఎత్తున చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న(మే26) ఒకే రోజు ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్ రాష్ట్రంలో వందల సంఖ్యలో గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. ఇంత పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చనిపోవటం స్థానికంగా కలకలం సృష్టించింది. గబ్బిలాల ద్వారా కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం జరగటంతో […]

భారీగా గబ్బిలాల మృతి...రెండు రాష్ట్రాల్లో కలకలం
Follow us on

కొవిడ్ వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల పాటుచుట్టేసిన వార్త…కానీ వైరస్ పుట్టుకపై క్లారిటీ రాలేదు. కరోనా మాత్రం ప్రపంచాన్ని వణికిస్తోంతి. అయితే తాజాగా భారతదేశంలోని రెండు రాష్ట్రాల్లో గబ్బిలాలు పెద్ద ఎత్తున చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న(మే26) ఒకే రోజు ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్ రాష్ట్రంలో వందల సంఖ్యలో గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి. ఇంత పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చనిపోవటం స్థానికంగా కలకలం సృష్టించింది. గబ్బిలాల ద్వారా కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం జరగటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే… బీహర్‌లో 200 గబ్బిలాలు ఒకే గ్రామంలో చనిపోయాయి. భోజ్‌పూర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో గల ఆరా వద్ద గబ్బిలాలు మృతి చెందాయి. ఓ చెట్టుపై నివాసం ఉంటున్న గబ్బిలాలు చనిపోయినట్లుగా స్థానికులు పశు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది.. వాటిని పాట్నాలోని జంతు పరిశోధన సంస్థకు పంపించారు. మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రత, తాగునీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అటవీ అధికారులు అంటున్నారు. నివేదిక వచ్చిన తర్వాత వాటి మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని తెలిపారు.