ఆధార్‌ – పాన్‌ లింకింగ్ కు.. చివరి తేదీ ఎప్పుడంటే..

| Edited By:

Jun 24, 2020 | 10:11 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు.

ఆధార్‌ - పాన్‌ లింకింగ్ కు.. చివరి తేదీ ఎప్పుడంటే..
Follow us on

PAN-Aadhaar linking: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది.

మరోవైపు.. పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది. అంటే పాన్ కార్డు లేనట్లే అవుతుందని ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఇన్‌కం టాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి కూడా వీలుకాదని హెచ్చరించింది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

Also Read: వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్ వాలా కూతురు..