అసోంలో వరద బీభత్సం.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు..

| Edited By:

Jun 26, 2020 | 1:17 PM

అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోం రాష్ట్రంలో గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో

అసోంలో వరద బీభత్సం.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు..
Follow us on

Dibrugarh AIR centre stops broadcast: అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోం రాష్ట్రంలో గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో 2 లక్షలమంది వరద బారిన పడ్డారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 11,500 మంది వరదబాధితులను సహాయశిబిరాలకు తరలించామని అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 13 మంది మరణించారు.

మంగళవారం నుండి దిబ్రూఘడ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి థీమాజీ, లక్ష్మిపూర్, బిశ్వనాథ్, గోలఘాట్, జోర్హాట్, మాజులీ, శివసాగర్, దిబ్రూఘడ్, తిన్ సుకియా జిల్లాల్లో వరదనీరు ప్రవహిస్తోంది. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దిబ్రూఘడ్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం వరదనీటిలో మునిగిపోవడంతో ప్రసారాలను నిలిపివేశారు. భూటాన్ దేశం కురిచ్చు డ్యామ్ నుంచి వరదనీటిని విడుదల చేయడంతో చిరాంగ్, బక్సా, బార్పేట జిల్లాల్లో వరదనీరు ప్రవహిస్తోంది.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..