
పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా జిల్లాలతో పాటు తీర ప్రాంతాలలో ఆగస్టు 18, 19 తేదీలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాబోయే రెండు రోజుల పాటు పూణే జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ఒక అధికారి తెలిపారు. “నైరుతి రుతుపవనాలు రాబోయే 4-5 రోజులు మహారాష్ట్రలో చురుకుగా ఉంటాయని, ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి” అని ముంబైకి చెందిన మరో వాతావరణ శాఖ అధికారి తెలిపారు. నిరంతర వర్షాల కారణంగా సాంగ్లి జిల్లాలోని కృష్ణ, వార్నా, కోయనా నదుల నీటి మట్టాలు పెరిగాయని అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ఏడాది వర్షాకాలంలో సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాల్లో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
Also Read : తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !