తెలంగాణలో ఓపీ సేవలు పునఃప్రారంభం..!

కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ ను పొడిగించారు. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొంతమేరకు సడలించడంతో సర్కారీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పునఃప్రారంభమయ్యాయి.

తెలంగాణలో ఓపీ సేవలు పునఃప్రారంభం..!

Edited By:

Updated on: May 07, 2020 | 11:35 AM

OP services in Hospitals: కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ ను పొడిగించారు. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొంతమేరకు సడలించడంతో సర్కారీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పునఃప్రారంభమయ్యాయి. గ్రీన్‌జోన్లలో ఆటోలు, క్యాబ్‌లు తిరగడంతో రోగులు ఆస్పత్రులకు చేరుకోగలిగారు. ఇప్పటికే ఎమర్జెన్సీ సేవలతో పాటు ఓపీని ప్రారంభించాలని సర్కారు ఆదేశించినా.. కరోనా భయంతో ఆస్పత్రులను తెరవలేదు.

మరోవైపు.. ఓపీ సేవలు ప్రారంభిస్తే జనం గుంపులుగా వస్తారని ప్రైవేటు ఆస్పత్రులు భయపడ్డాయి. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ సడలింపుతో గ్రీన్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆస్పత్రులు ఓపీ సేవలను పునఃప్రారంభించాయి. హైదరాబాద్‌ రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నా… కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. కట్టడి ప్రాంతాల్లో మినహాయిస్తే… మిగతా ఆస్పత్రుల్లో ఓపీ సేవలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.

Also read: తెలంగాణలో.. ‘మీ’ సేవలు షురూ