
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలని భావిస్తోంది. స్వదేశీ పరిశ్రమలను తోడ్పాటు అందించేందుకు కేంద్ర పోలీసు క్యాంటీన్లలో సీపీసీ దేశీయ ఉత్పత్తులనే విక్రయిస్తున్నామని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీపీసీలను కేంద్రీయ పోలీసు కల్యాణ్ భండార్‌గా మార్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్ లో ప్రకటించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ప్రస్తుతం 119 మాస్టర్ భండార్, 1,871 అనుబంధ భండార్లు, విశ్రాంత సిబ్బంది కోసం 10 మినీ భండార్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు.
చైనాతో సరిహద్దు ఘర్షణల అనంతరం దేశవ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అంతేకాదు చైనా నుంచి వస్తువుల దిగుమతిని పూర్తిస్థాయిలో తగ్గించుకునేందుకు నిర్ణయించింది.