తెలంగాణ : జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్లైన్ లో శిక్షణ..రేప‌ట్నుంచే..

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 5:49 PM

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్లైన్ లో శిక్షణ తరగతులు నిర్వ‌హించ‌నున్నారు ఇంట‌ర్ బోర్డు అధికారులు. రేపటి నుంచి 15 రోజుల పాటు 'డిజిటల్ దిశా' పేరుతో క్లాసుల నిర్వ‌హ‌ణ సాగ‌నుంది.

తెలంగాణ : జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్లైన్ లో శిక్షణ..రేప‌ట్నుంచే..
Follow us on

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్లైన్ లో శిక్షణ తరగతులు నిర్వ‌హించ‌నున్నారు ఇంట‌ర్ బోర్డు అధికారులు. రేపటి నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్ దిశా’ పేరుతో క్లాసుల నిర్వ‌హ‌ణ సాగ‌నుంది. 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్ లుగా విభ‌జించి ఆన్లైన్ విద్యాబోధన, డిజిటల్ తరగతులపై శిక్షణా కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ సాగ‌నుంది.

క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది స్కూళ్లు, కాలేజీలు స‌జావుగా సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అందుకే విద్యార్థుల విద్యా సంవ‌త్సరం వేస్ట్ అవ్వ‌కుండా డిజిట‌ల్ క్లాసులు, ఆన్లైన్ శిక్ష‌ణపై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. వాటికి సంబంధించి ఇప్పుడు ఇంట‌ర్ లెక్చ‌ర‌ర్ల‌కు ట్రైనింగ్ ఇవ్వ‌బోతుంది.