వాహనదారులకు గుడ్ న్యూస్… ఇక ఇంటి నుండే లైసెన్స్…?

| Edited By:

Feb 06, 2020 | 5:10 AM

వాహనదారులకు శుభవార్త. ఇక ఇంటినుండే లెర్నింగ్ లైసెన్సు పొందొచ్చు. ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఆన్ లైన్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవాణాశాఖ అధికారులు వాహనదారులు ఇంటినుండే లెర్నింగ్ లైసెన్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. మాములుగా లెర్నింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు ఆర్టీఏ కార్యాలయంలో స్లాట్ […]

వాహనదారులకు గుడ్ న్యూస్... ఇక ఇంటి నుండే లైసెన్స్...?
Follow us on

వాహనదారులకు శుభవార్త. ఇక ఇంటినుండే లెర్నింగ్ లైసెన్సు పొందొచ్చు. ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఆన్ లైన్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవాణాశాఖ అధికారులు వాహనదారులు ఇంటినుండే లెర్నింగ్ లైసెన్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు.

మాములుగా లెర్నింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు ఆర్టీఏ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకొని కేటాయించిన సమయానికి పరీక్షకు వెళ్లి 20 మార్కులకు 12 మార్కులను సాధిస్తే లైసెన్సులు జారీ అవుతాయి. ఆ తరువాత ఆరు నెలలలో డ్రైవింగ్ టెస్ట్ పెట్టి నిర్ణీత కాలానికి లైసెన్స్ లను అందజేస్తారు.

కాగా.. రవాణాశాఖ అవినీతిలో కూరుకుపోయిందని వాహనదారుల నుండి విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి. చాలా ప్రాంతాలలో దళారుల ద్వారా పరీక్షకు హాజరైన వారు మాత్రమే ఉత్తీర్ణులు అవుతారని మిగతావారు ఉత్తీర్ణులు కారని ఆరోపణలు ఉన్నాయి. నూతన విధానంలో రవాణాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎల్.ఎల్.ఆర్ ధరఖాస్తు లింక్ ను ఓపెన్ చేసి వివరాలను నింపి ఫీజు చెల్లించాలి.

ఫీజు చెల్లించైనా వెంటనే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పై పరీక్ష పత్రం కనిపిస్తుంది. పది నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. సమయం పూర్తయితే ఆటోమేటిక్ గా సైట్ మూతపడుతుంది. ఈ విధానం ద్వారా పక్కాగా పరీక్షకు సిద్ధమైన వారు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. మరో నెల రోజులలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.