కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి..

|

Nov 24, 2019 | 4:43 PM

ఉల్లి రేటు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. రిటైల్‌లోనే నాణ్యమైన కేజీ ఉల్లి 90 నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డ అనే పేరు పలికేందుకు సైతం సామాన్యులు హడలిపోతున్నారు. ఉల్లి వాడకాన్ని తగ్గించేస్తున్నారు.  రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి దొరకడం లేదు. చిన్నగా ఉన్న ఉల్లిగడ్డలనే కేజీ 40 రూపాయలకు అమ్ముతున్నారు. ధరలు అందుబాటులో లేనప్పుడు వాడకాన్ని తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని సామాన్యులు అంటున్నారు. ప్రస్తుతం ఉల్లిపాయలను కొనే పరిస్థితి లేదంటున్నారు ప్రజలు. […]

కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి..
Follow us on

ఉల్లి రేటు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. రిటైల్‌లోనే నాణ్యమైన కేజీ ఉల్లి 90 నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డ అనే పేరు పలికేందుకు సైతం సామాన్యులు హడలిపోతున్నారు. ఉల్లి వాడకాన్ని తగ్గించేస్తున్నారు.  రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి దొరకడం లేదు. చిన్నగా ఉన్న ఉల్లిగడ్డలనే కేజీ 40 రూపాయలకు అమ్ముతున్నారు. ధరలు అందుబాటులో లేనప్పుడు వాడకాన్ని తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని సామాన్యులు అంటున్నారు.

ప్రస్తుతం ఉల్లిపాయలను కొనే పరిస్థితి లేదంటున్నారు ప్రజలు. కొంతమంది దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉల్లి కొరత లేకుండా చేయాలని కోరుతున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించారు ప్రజలు. ఇదే కంటిన్యూ అయితే ఉల్లిగడ్డ మరిచిపోవాల్సి వస్తుందంటున్నారు. ఇటు ఉల్లి ధర పెరగడం వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారింది. బిర్యానీ సెంటర్‌ నిర్వాహకులు, టిఫెన్‌ సెంటర్లలో ఉల్లిపాయల్ని తగ్గించేశారు. కొన్ని హోటల్స్‌లో ఆనియన్‌ సలాడ్ ఇవ్వడమే మానేశారు. వేస్టేజ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పానీపూరి వ్యాపారుల పరిస్తితయితే వర్ణనాతీతం. ఉల్లి లేకుండా పానీపూరి తినడం కష్టం. ఉల్లిగడ్డలు లేని కారణంగా చాలామంది తినకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల తమకు ఎంతో నష్టాన్ని మిగులుస్తోందని వాపోతున్నారు.