బెంగళూరులో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి

బెంగళూరులోని పులకేశి నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పులువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు బీహార్‌కు చెందిన కార్మికుడిగా పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ఆరుగురిని వెలికి తీయగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స […]

బెంగళూరులో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి

Edited By:

Updated on: Jul 10, 2019 | 4:47 PM

బెంగళూరులోని పులకేశి నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పులువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు బీహార్‌కు చెందిన కార్మికుడిగా పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ఆరుగురిని వెలికి తీయగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.