చైనాకు భారత్ మరో ‘చెక్‘

|

Oct 17, 2020 | 3:20 PM

భారత్‌కు పక్కలో బల్లెంలా తయారై సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న డ్రాగన్ దేశానికి చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది మోదీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా తాజాగా జారీ చేసిన ఓ సర్క్యులర్‌తో చైనాకు మోదీ సర్కార్ చెక్ పెట్టింది.

చైనాకు భారత్ మరో ‘చెక్‘
Follow us on

One more check to China: భారత్‌కు పక్కలో బల్లెంలా తయారై సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న డ్రాగన్ దేశానికి చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది మోదీ ప్రభుత్వం. పలు చైనీస్ మొబైల్ యాప్‌లను ఇదివరకే నిషేధించిన ప్రభుత్వం.. తాజాగా డిజిటల్ మీడియాలో భారీగా పెట్టుబడులు పెడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు చైనా వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. డిజిటల్ మీడియాలో చైనా పెట్టుబడులు మితిమీరుతుండడం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం చర్యలకుపక్రమించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలలో విదేశీ పెట్టుబడులు 26 శాతానికి మించకుండా వుండేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి వుందంటూ సర్క్యులర్ జారీ చేసింది. దానికి తోడు సదరు సంస్థకు భారతీయుడే అధినేతగా వుండాలని, సంస్థలో పని చేసే విదేశీ ఉద్యోగులు 60 రోజులకు మించి ఇక్కడ ఉండాల్సి వస్తే వారికి సెక్యూరిటీ క్లియరెన్స్ అనివార్యమని కొన్ని కఠినతరమైన నియమ నిబంధనలకు సర్క్యులర్‌లో పొందు పరిచింది.

26 శాతం ఎఫ్‌డీఐ నిబంధనను అమలు చేయడం ద్వారా భారత్‌లో పని చేస్తున్న డిజిటల్ మీడియాలో పెట్టుబడులు పెడుతున్న చైనా, ఇతర విదేశీ కంపెనీలపై చెక్ పెట్టడం ప్రభుత్వానికి వీలవుతుంది. డైలీ హంట్, హలో, యుఎస్ న్యూస్, ఒపెరా న్యూస్, న్యూస్‌డాగ్ వంటివి ప్రస్తుతం మన దేశంలో ఉన్న కొన్ని చైనీస్, విదేశీ నియంత్రిత-డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్. ఇలాంటి డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ 2016లో జరిగిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది.

స్వయం స్వావలంబన, బాధ్యతతో కూడిన డిజిటల్ న్యూస్ మీడియా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే కొత్తగా సర్క్యులర్ జార చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియా సంస్థ బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు భారత పౌరులుగా ఉండటం వంటి కొన్ని షరతులకు కంపెనీ కట్టుబడి ఉండాలి. అధినేత కచ్చితంగా భారతీయుడే ఉండాలి. ఈ నిర్ణయం భారతీయ ప్రయోజనాలకు పక్షపాతం లేని నిజమైన ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి వచ్చే నకిలీ వార్తలు సమాచార ముప్పు ఉన్నందున ఈ నియమాల ద్వారా భారతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా వుంటుంది. 2023 సాధారణ ఎన్నికలను దృష్టిలో వుంచుకునే మోదీ ప్రభుత్వం తాజా సర్క్యులర్ విడుదల చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Also read: దుబ్బాకలో వేడెక్కుతున్న ప్రచారం