Home Quarantine For 60 Years People: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల పైబడిన వారు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులు, దీర్ఘకాలిక రోగులు ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రభుత్వం సూచించింది.
మరో నెల రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని స్పష్టం చేసింది. వీరికి వైరస్ సోకితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీరంతా కూడా హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని… కుటుంబసభ్యులు వీరిని జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కొంతమంది ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్ వాడుతున్నారని.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని వాడకూడదని ప్రభుత్వం తెలిపింది.
Also Read:
జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…