సముద్రంలో కుప్పకూలిన కెనడా నేవీ చాపర్..!

| Edited By:

May 01, 2020 | 8:29 PM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంబిస్తున్న విసయం తెలిసందే. దీని ప్రభావంతో అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని దేశాల్లో ఇతర ఘటనలు కూడా విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా కెనడా మిలటరీకి చెందిన ఓ చాపర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గ్రీస్, ఇటలీ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ సీ బార్డర్స్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నాటో నేవల్ టాస్క్‌ఫోర్స్ రాయల్ […]

సముద్రంలో కుప్పకూలిన కెనడా నేవీ చాపర్..!
Follow us on

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంబిస్తున్న విసయం తెలిసందే. దీని ప్రభావంతో అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని దేశాల్లో ఇతర ఘటనలు కూడా విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా కెనడా మిలటరీకి చెందిన ఓ చాపర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గ్రీస్, ఇటలీ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ సీ బార్డర్స్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నాటో నేవల్ టాస్క్‌ఫోర్స్ రాయల్ కెనడా నేవీ హెలికాప్టరు గ్రీస్‌లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడీ ప్రకటించారు. ఈ నేవీకి చెందిన చాపర్‌లో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు సభ్యులతో పాటుగా.. మరో ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. చాపర్ కుప్పకూలిన ప్రాంతంలో గాలింపు చేపడుతున్నామని.. ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని తెలిపారు. చాపర్ కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నామని పేర్కొన్నారు.