రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో కేవలం 4 శాతం వడ్డీకే రుణం..

| Edited By:

Jul 13, 2020 | 6:48 AM

రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తోంది. రైతులకు సాయం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో అతి తక్కువ అంటే సుమారు 4% వడ్డీకే రుణం

రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో కేవలం 4 శాతం వడ్డీకే రుణం..
Follow us on

Kisan Credit Card Scheme: రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తోంది. రైతులకు సాయం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో అతి తక్కువ అంటే సుమారు 4% వడ్డీకే రుణం లభిస్తుంది. వాస్తవంగా 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నా, సకాలంలో సక్రమంగా చెల్లిస్తే 3 శాతం వడ్డీ మినహాయింపు పొందుతారు. సొంత భూమి ఉన్న రైతులు, ఉమ్మడి సాగుదారులు, కౌలు రైతులతో పాటు స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దీన్ని పొందాలంటే దరఖాస్తుతో పాటు గుర్తింపు ధ్రువపత్రాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!