భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి ప్రమాదకరంగా పెరుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2526192 కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 996 మంది కరోనా వల్ల ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 49036కి చేరింది. భారత్‌లో ప్రజంట్ మరణాల రేటు 1.9 శాతంగా ఉండగా… ప్రపంచంలో అది 3.57గా ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో… 57381 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దింతో మొత్తం రికవరీల సంఖ్య 1808936కి చేరింది. ప్రస్తుతం దేశంలో 668220 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్పష్టత